ఒక హల్లుకు ఇంకొక హల్లును చేర్చిన రూపాంతరం చెందిన రెండవ హల్లుని ఒత్తు అంటారు.
అక్షరం – Hallu | Symbol | Example Word |
---|---|---|
క | ![]() | క్క – అక్క |
ఖ | ![]() | ఖ్ఖ |
గ | ![]() | గ్గ – మొగ్గ |
ఘ | ![]() | ఘ్ఘ |
చ | ![]() | చ్చ – పచ్చ |
ఛ | ![]() | ఛ్ఛ |
జ | ![]() | జ్జ – గజ్జలు |
ఝ | ![]() | ఝ్ఝ |
ట | ![]() | ట్ట – పొట్ట |
ఠ | ![]() | ఠ్ఠ |
డ | ![]() | డ్డ |
ఢ | ![]() | ఢ్ఢ |
ణ | ![]() | ణ్ణ |
త | ![]() | త్త – కొత్త |
థ | ![]() | థ్థ |
ద | ![]() | ద్ద – ముద్ద |
ధ | ![]() | ధ్ధ |
న | ![]() | న్న – అన్న |
ప | ![]() | ప్ప – కప్ప |
ఫ | ![]() | ఫ్ఫ |
బ | ![]() | బ్బ |
భ | ![]() | భ్భ |
మ | ![]() | మ్మ – అమ్మ |
య | ![]() | య్య – కొయ్య |
ర | ![]() | ర్ర |
ల | ![]() | ల్ల – పిల్ల |
వ | ![]() | వ్వ – అవ్వ |
శ | ![]() | శ్శ |
ష | ![]() | ష్ష |
స | ![]() | స్స |
హ | ![]() | హ్హ |
ళ | ![]() | ళ్ళ |
క్ష | క్ష | (క్ష) |
ఱ | ఱ | ఱ్ఱ |
ద్విత్వాక్షరములు:
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: అన్నము, మగ్గము
సంయుక్తాక్షరములు:
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాజ్యము, మద్యము
సంశ్లేషాక్షరములు:
ఒక హల్లుకు ఒకటికన్నా ఎక్కువ హల్లులు ఒత్తుగా వచ్చును.
ఉదా: రాష్ట్రము, మత్స్యము
మహాప్రాణాక్షరములు:
ఒక హల్లులోనే ఒత్తును కలిగియుండును.
ఉదా: శంఖము, పాఠశాల