జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||

జయ జయ సశ్యామల
సుశ్యామచలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||

– రచించిన వారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి